Vote For Us Get A piece Of Land In Us
తాజాగా జరగుతున్న ఐదు రాష్ట్రాల
ఎన్నికల నేపథ్యంలో అకాలీదళ్ ఇచ్చిన ఎన్నికల హామీ గురించి వింటే దిమ్మ తిరిగి మైండ్
బ్లాక్ అయిపోవాల్సిందే. తమకు కానీ ప్రజలు ఓటు వేస్తే.. అమెరికా.. కెనడాల్లో లక్ష ఎకరాల
భూమిని కొనుగోలు చేసి.. ప్రజలకు పంచిపెడతామని.. ఆయా దేశాలకు వలస వెళ్లేందుకు సాయం చేస్తామని
అదిరిపోయే హామీని ఇచ్చేసింది.
పంజాబ్ లో ఓటేస్తే అమెరికాలో భూమి ఇస్తారట?
ఈ రోజుఆ పార్టీ విడుదల చేసిన
మేనిఫేస్టోలో ఈ విషయాన్ని పేర్కొంటూ.. ‘‘విదేశాల్లో భూములు కొనుగోలు చేసి.. ప్రజలకు
అందిస్తాం’’ అని పేర్కొంది. విదేశాల్లో భూములు కొని స్వదేశంలోని ప్రజలకు ఇస్తామన్న హామీని
ప్రకటించటం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారిగా చెబుతున్నారు. పార్టీ చీఫ్ సుఖబీర్ సింగ్
బాదల్.. విడుదల చేసిన పార్టీ మేనిఫేస్టో ప్రకారం.. శిరోమణి అకాలీదళ్ పంజాబ్ లో కానీ
పవర్ లోకి వస్తే.. రైతుల కోసం విదేశాల్లో లక్ష ఎకరాల భూమిని కొనుగోలు చేస్తారు. వాటిని
రైతులకు పంపిణీ చేస్తారు. అంతేకాదు.. ఆయా దేశాల్లో వారికి శాశ్విత నివాసం కోసం కూడా
ప్రయత్నిస్తారని పేర్కొంది. ఈ తరహా చిత్ర.. విచిత్రమైన హామీని ప్రకటించిన నేపథ్యంలో..
రానున్నరోజుల్లో ఇలాంటి హామీలు ఇంకెన్ని తెర మీదకు వస్తాయో..?
No comments:
Post a Comment