పెళ్లయిన హీరోయిన్లకు డిమాండ్ లేదంతే
భారతీయ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్.. ఆ భామకు పెళ్లయ్యే వరకే పరిమితం. యంగ్ఏజ్ లో కెరీర్ స్టార్ట్ చేసి.. ఓ వసయు వచ్చే వరకు హీరోయిన్లుగా చేయడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పక్కకు తప్పుకోవడం తప్పనిసరి. దేశంలో ఏ భాషలోని సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇదే.ఇప్పుడు షారూక్ ఖాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ నటించిన రాయీస్ చిత్రం రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొత్త ఐడియాలు చాలానే వేసింది రాయీస్ యూనిట్. అయితే.. 'పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తర్వాత కూడా హాలీవుడ్ లో హీరోయిన్లుగా నటిస్తుంటే.. మన దగ్గర అలా ఎందుకు జరగదు?' అనే ప్రశ్న షారూక్ ఖాన్ కి ఎదురైంది. 'మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగానే హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాం. పెళ్లయిన మహిళలను హీరోయిన్లుగా చూసేందుకు ఆడియన్స్ అంతగా ఇష్టపడరు' అంటూ తప్పంతా ప్రేక్షకులపై తోసేశాడు షారూక్.
No comments:
Post a Comment