Wednesday, January 25, 2017

Shahrukh Khan Is On His Herion Selection | {పెళ్లయిన హీరోయిన్లకు డిమాండ్ లేదంతే}

పెళ్లయిన హీరోయిన్లకు డిమాండ్ లేదంతే

భారతీయ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్.. ఆ భామకు పెళ్లయ్యే వరకే పరిమితం. యంగ్ఏజ్ లో కెరీర్ స్టార్ట్ చేసి.. ఓ వసయు వచ్చే వరకు హీరోయిన్లుగా చేయడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పక్కకు తప్పుకోవడం తప్పనిసరి. దేశంలో ఏ భాషలోని సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇదే.

పంజాబ్ లో ఓటేస్తే అమెరికాలో భూమి ఇస్తారట? | Vote For Us Get A Piece Of Land In Us

Vote For Us Get A piece Of Land In Us

 ఎన్నో రాజకీయ పార్టీలు.. ఇప్పటికి ఎన్నో హామీలు ఇచ్చిఉంటాయి. మీరు కూడా ఇప్పటివరకూ ఎన్నో హామీల్ని విని ఉంటారు. చదివి ఉంటారు. కానీ.. మేం ఇప్పుడు చెప్పబోయే హామీని ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ ఇంతవరకూ ప్రకటించలేదు కూడా. అలాంటి చిత్రమైన హామీని ఇచ్చి సంచలనం సృష్టించారు పంజాబ్ లోని శిరోమణి అకాలీదల్.

తాజాగా జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అకాలీదళ్ ఇచ్చిన ఎన్నికల హామీ గురించి వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. తమకు కానీ ప్రజలు ఓటు వేస్తే.. అమెరికా.. కెనడాల్లో లక్ష ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. ప్రజలకు పంచిపెడతామని.. ఆయా దేశాలకు వలస వెళ్లేందుకు సాయం చేస్తామని అదిరిపోయే హామీని ఇచ్చేసింది.

పంజాబ్ లో ఓటేస్తే అమెరికాలో భూమి ఇస్తారట?

ఈ రోజుఆ పార్టీ విడుదల చేసిన మేనిఫేస్టోలో ఈ విషయాన్ని పేర్కొంటూ.. ‘‘విదేశాల్లో భూములు కొనుగోలు చేసి.. ప్రజలకు అందిస్తాం’’ అని పేర్కొంది. విదేశాల్లో భూములు కొని స్వదేశంలోని ప్రజలకు ఇస్తామన్న హామీని ప్రకటించటం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారిగా చెబుతున్నారు. పార్టీ చీఫ్ సుఖబీర్ సింగ్ బాదల్.. విడుదల చేసిన పార్టీ మేనిఫేస్టో ప్రకారం.. శిరోమణి అకాలీదళ్ పంజాబ్ లో కానీ పవర్ లోకి వస్తే.. రైతుల కోసం విదేశాల్లో లక్ష ఎకరాల భూమిని కొనుగోలు చేస్తారు. వాటిని రైతులకు పంపిణీ చేస్తారు. అంతేకాదు.. ఆయా దేశాల్లో వారికి శాశ్విత నివాసం కోసం కూడా ప్రయత్నిస్తారని పేర్కొంది. ఈ తరహా చిత్ర.. విచిత్రమైన హామీని ప్రకటించిన నేపథ్యంలో.. రానున్నరోజుల్లో ఇలాంటి హామీలు ఇంకెన్ని తెర మీదకు వస్తాయో..?


సూర్య ‘ఎస్-3’ (య‌ముడు-3) కొత్త రిలీజ్ డేట్ | సింగం3 కొత్త రిలీజ్ డేట్ - ఫిబ్రవరి 9

‘ఎస్-3’ (య‌ముడు-3)  కొత్త రిలీజ్ డేట్:

ఇప్పటికే ‘ఎస్-3’ రిలీజ్ డేట్ అంటూ చాలా ప్రకటనలు చూశాం. ఇప్పుడు ఇంకో కొత్త డేట్ వచ్చింది. రెండు రోజుల కిందట ఈ సినిమాను జనవరి 26 నుంచి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా నెక్స్ట్ డేట్ ఫిబ్రవరి 3 అని ప్రచారం జరిగింది. ఐతే ఈ సినిమాను ఆ రోజు రిలీజ్ చేయట్లేదట. ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తారట. గురువారం సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 9కి ఫిక్సయ్యాడు సూర్య. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా పడ్డప్పటికీ.. ఈ డేట్ మాత్రం ఫైనల్ అంటోంది చిత్ర బృందం.

సూర్య (య‌ముడు-3) కొత్త రిలీజ్ డేట్ - ఫిబ్రవరి 9:

ఫిబ్రవరి 3న కాకుండా 9న సినిమాను రిలీజ్ చేయడం నాని మూవీ ‘నేను లోకల్’కు ఊరటనిచ్చేదే. సూర్య య‌ముడు-3 సినిమా ఆ రోజు వస్తుందనగానే ఆ చిత్ర బృందం కొంత కంగారు పడే ఉంటుంది. ఎందుకంటే సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ఏంటో మనోళ్లకు బాగానే తెలుసు. నానిని వదిలేసిన సూర్య.. సీనియర్ హీరో నాగార్జునకు పోటీ ఇవ్వబోతున్నాడు. ‘ఓం నమో వేంకటేశాయ’ ఫిబ్రవరి 10న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఆధ్యాత్మిక చిత్రం కావడంతో మాస్ ప్రేక్షకుల్ని సూర్య ఎస్-3 సినిమానే ఎక్కువ ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. హరి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎస్-3’ని తమిళంలో సూర్య కజిన్ జ్నానవేల్ రాజా నిర్మించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని మాల్కాపురం శివకుమార్ అందిస్తున్నాడు.